: కేంద్ర ఖజానాకు చేరిన రూ. 32,300 కోట్లు


ఇటీవలి 2జీ రేడియో తరంగాల వేలం తరువాత, వేలంలో తరంగాలను గెలుచుకున్న కంపెనీలు రూ. 32 వేల కోట్లను కేంద్ర ఖజానాకు చెల్లించాయి. భారతీ ఎయిర్ టెల్ రూ. 11,347 కోట్ల రూపాయలను చెల్లించింది. ఈ సంస్థ ఇంకా రూ. 7,832 కోట్లను కట్టాల్సివుంది. రాజస్థాన్, ఈశాన్య సర్కిల్స్ లో స్పెక్ట్రంకు సంబంధించి మొత్తం డబ్బు కట్టేశామని ఎయిర్ టెల్ వివరించింది. ఇప్పటివరకూ రూ. 32,377.85 కోట్లు తమకు అందాయని, మరో రూ. 3,500 కోట్లు రావాల్సివుందని డిపార్ట్ మెంట్ అఫ్ టెలికాం (డాట్) వెల్లడించింది. నిబంధనల మేరకు బ్యాంకు గ్యారెంటీలను టెల్కోలు అందించాయని పేర్కొంది. మార్చి నెలలో 19 రోజులపాటు సాగిన తరంగాల వేలం తరువాత రూ. 1.10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిధులతో బడ్జెట్ లోటును పరిమితుల్లో ఉంచాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. కాగా, ఎయిర్ సెల్ రూ. 742 కోట్లు, ఐడియా సెల్యులార్ రూ. 7,734 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 1,104 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకాం రూ. 2,591 కోట్లు, టాటా టెలి సర్వీసెస్ రూ. 2,013 కోట్లు, వోడాఫోన్ రూ. 6,817 కోట్లను ఖజానాకు జమ చేశాయని డాట్ తెలిపింది.

  • Loading...

More Telugu News