: తిరుమలలో మొరాయించిన కంప్యూటర్లు... భక్తుల ఇబ్బందులు
తిరుమలలో పడ్డ భారీ వర్షానికి కేబుల్స్ దెబ్బతినడంతో కంప్యూటర్లు మొరాయించాయి. దీంతో కల్యాణకట్ట, అద్దె గదుల కేటాయింపు సేవలకు అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తలనీలాలు సమర్పించే భక్తులు రెండు గంటలకు పైగా నిరీక్షిస్తున్నట్టు తెలిసింది. వీరికి టోకెన్లు జారీ చేసే కంప్యూటర్లు పని చేయడంలేదు. సీఆర్ఓ కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సాధ్యమైనంత త్వరలో సేవలు పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.