: సుస్వాగతం... చదువుల తల్లికి 13 అమెరికా వర్సిటీల ఆహ్వానం
అమెరికాలో ఒక లీగ్ స్కూల్ లో ప్రవేశం పొందితేనే విద్యార్థి ఎంతో విజయం సాధించినట్టు. అలాంటిది ఆమె 14 టాప్ వర్సిటీలకు దరఖాస్తు చేస్తే, అన్నీ ఆమెకు ప్రవేశాన్ని ఖరారు చేశాయి. ప్రవాస భారతీయ దంపతులు చంద్రశేఖర్, ప్రతిభల గారాల ముద్దు బిడ్డ పూజ ఈ ఘనతను సాధించింది. హార్వర్డ్, యేల్, ప్రిన్స్ టన్, కార్నెల్, డార్ట్ మౌత్, కొలంబియా, బ్రౌన్, యూనివర్సిటీ అఫ్ పెన్సిల్వేనియాలు ఆమెకు వెల్ కం పలికాయి. వీటితోపాటు మసాచుసెట్స్ ఇన్స్ టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్ ఫోర్డ్, డ్యూక్, జార్జియా టెక్, ది యూనివర్సిటీ అఫ్ వర్జీనియా, ది యూనివర్సిటీ అఫ్ మిచిగాన్ లు సైతం ఆమెకు ప్రవేశం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇవన్నీ మంచి సంస్థలేనని, అయితే ఎందులో చేరాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని పూజ చెబుతోంది. ఏ సాట్ లో 2,400 పాయింట్లకుగాను 2,390 పాయింట్లను సాధించడంతో పాటు, గ్రేడ్ పాయింట్ సరాసరి 4.57గా ఉండడంతో ఆమె దరఖాస్తు చేసిన అన్ని వర్సిటీలు ఓకే చెప్పాయి. ఈ అమ్మాయి 'స్టెమ్' పేరిట ఒక లాభాపేక్ష లేని సంస్థను నిర్వహిస్తూ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ విభాగాల్లో బాలికలు పాల్గొనేలా ప్రోత్సహిస్తోంది కూడా. అల్ ది బెస్ట్ పూజా!