: ఒకప్పుడు బిలియనీర్... ఇప్పుడు రూ.50 రోజు కూలి!


ఒకప్పుడు ఖరీదైన ఏసీ కార్లలో దుస్తుల మడత చెరగకుండా తిరిగిన బిలియనీర్ బైర్రాజు రామలింగరాజు. ఇప్పుడు చర్లపల్లి కేంద్ర కారాగారంలో రోజుకు రూ. 50 రూపాయలకు కూలిపని చేస్తున్నారు. జనవరి 2009లో తాను చేసిన తప్పును ఒప్పుకున్న తరువాత ఆయన తలరాత తిరగబడింది. వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డ ఆయనకు కోర్టు ఏడేళ్ళ జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. జైలులో ఖైదీ నెంబర్ 4148గా ఉన్న ఆయనను జైలు అధికారులు 'నైపుణ్యమున్న ఖైదీ'గా గుర్తించారు. ఈ విభాగంలోని ఖైదీలకు రోజుకు రూ. 50 కూలీగా లభిస్తుంది. అందులో నుంచి ఆయన రోజుకు రూ. 25 మాత్రమే ఖర్చు పెట్టుకోవచ్చు. ఆయనకు లైబ్రరీ నిర్వహణ, కంప్యూటర్ తరగతుల నిర్వహణ, విద్య బోధన వంటి పనులను అప్పగించే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆయన జైలు వాతావరణానికి ఎలా అలవాటు పడుతున్నారన్న విషయాన్ని తొలి 15 రోజులు పరిశీలిస్తామని, ఇప్పటివరకూ ఆయన నిరాశలో ఉన్నట్టు కనిపించలేదని జైలు అధికారి ఒకరు తెలిపారు. రాజునుగానీ, ఆయన సోదరుడు రామరాజునుగానీ కలిసేందుకు ఇంతవరకూ ఎవరూ రాలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News