: ఔటర్ రింగ్ రోడ్డుపై రేసింగ్ కారులో మంటలు... దూకి పరారైన రేసర్లు
వాహన సంచారం అంతగా లేకుండా విశాలంగా ఉండే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఉదయం ఒక రేసింగ్ కారు ప్రమాదానికి గురైంది. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా, తమ రేసింగ్ కోరికను తీర్చుకునేందుకు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. హిమాయత్ సాగర్ వద్ద వేగంగా దూసుకెళ్తున్న రెండు కార్లు ఒకదానికొకటి గుద్దుకొని డివైడర్ ను ఢీకొట్టడంతో ఓ కారులో మంటలు చెలరేగాయి. కార్ల నుంచీ బయటకు దూకిన రేసర్లు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కార్లను వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.