: ఆగని తమిళ తంబీల ఆగ్రహం... నాలుగు హోటళ్ళపై దాడులు
తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం దొంగల ఎన్ కౌంటర్ పై తమిళనాట ఆగ్రహావేశాలు చల్లారలేదు. ఈ ఉదయం 7 గంటల సమయంలో చెన్నై, అంబాలీనగర్ పరిధిలోని తెలుగువారు నిర్వహిస్తున్న 4 హోటళ్ళపై దాడులు జరిగాయి. సుమారు 15 మంది నిరసనకారులు హోటళ్ళపై దాడులు చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. మరోవైపు వరుసగా 7వ రోజు కూడా చెన్నై, మధురై తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా, మదనపల్లి, పుత్తూరు ప్రాంతాల టమోటా రైతులు తమ పంటను తమిళనాడుకు తరలించలేక ఇబ్బందులు పడుతున్నారు.