: ఖాకీల 'వేడి శిక్ష’పై ఉన్నతాధికారుల సీరియస్
సముద్రంలో స్నానం చేస్తున్న యువకులను తీసుకొచ్చి మండుటెండలో అర్ధనగ్నంగా గ్రానైట్ రాళ్ళపై పడుకోబెట్టిన పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్టు సమాచారం. విశాఖలోని ఆర్ కే బీచ్ లో స్నానం చేస్తున్న కొందరిని వెల్లకిలా పడుకోబెట్టిన ఘటనపై మీడియాలో వార్తలు రాగా, పూర్తి విచారణ జరిపి బాధ్యుల వివరణ అందజేయాలని నగర పోలీస్ కమిషనరేట్ ను ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది. కాగా, ఎవరో మత్స్యకారులు వారిని ఎండలో వుంచారని, తమకు సమాచారం వస్తే, ఆ ప్రాంతానికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించామని పోలీసులు అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.