: అకాల వర్షాలతో తడిసి ముద్దయిన తెలంగాణ


తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, సాధారణ జీవనం స్తంభించింది. వరంగల్ జిల్లాలోని హన్మకొండ, ఖాజీపేట, స్టేషన్‌ ఘన్‌ పూర్, జనగాం, చేర్యాల, వర్ధన్నపేట, పరకాల, పాలకుర్తిలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా, ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, భైంసా, బోథ్, ఉట్నూరు ప్రాంతాల్లో, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. పలుచోట్ల ఇంకా వర్షం జోరు తగ్గక పోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షపు జల్లులు పడుతున్నాయి. నల్లగొండ జిల్లాలో తేలికపాటి వర్షం పడుతున్నట్టు తెలుస్తోంది. త్రిపురారం మండలం మాటూరులో పిడుగులు పడి కొన్ని ఇళ్లు దగ్ధమైనట్టు సమాచారం. హైదరాబాద్ లోని బంజారాహిల్స్, ఖైరతాబాద్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో తెల్లవారుఝామున, తార్నాక, లాలాపేట, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది.

  • Loading...

More Telugu News