: ఎవరైనా పాడి ఉంటే మామూలు పాట అయ్యేది...మంచు లక్ష్మి వల్ల సంచలనం అయింది!: రఘు కుంచె
తన సంగీత దర్శకత్వంలో వచ్చిన 'దొంగాట' పాటను అభిమానులు ఆదరించినందుకు ధన్యవాదాలని సంగీత దర్శకుడు రఘు కుంచె చెప్పాడు. 'దొంగాట' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ పాటను వేరెవరైనా సింగర్ పాడి ఉంటే అది కేవలం పాట మాత్రమే అయి ఉండేదని, మంచు లక్ష్మి పాడడం వల్ల అది సంచలనం అయిందని అన్నాడు. ఈ పాటను విన్న తరువాత మోహన్ బాబు గారు ఫోన్ చేసి 10 నిమిషాలు అభినందిస్తూ మాట్లాడారని సంతోషం వ్యక్తం చేశాడు. యూట్యూబ్ లో మంచు లక్ష్మి పాడిన పాటకు విశేషమైన ఆదరణ లభించిందని, ఆదరించిన అందరికీ ధన్యవాదాలని రఘు తెలిపాడు.