: 45 పరుగుల తేడాతో విజయం సాధించిన చెన్నై


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుపై 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. 210 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాదు ఇన్నింగ్స్ ను కెప్టెన్ శిఖర్ ధావన్ (26) ధాటిగా ఆరంభించాడు. అతనికి డేవిడ్ వార్నర్ (53) సహకారమందించాడు. నమన్ ఓజా(15), రవి బొపారా(22), విలియమ్సన్ (26) ఓ మాదిరిగా ఆడినప్పటికీ, చెన్నైలు విధించిన లక్ష్యం చేరే దిశగా హైదరాబాదు ఇన్నింగ్స్ కొనసాగలేదు. దీంతో సన్ రైజర్స్ భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో చెన్నై ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News