: వెండితెరకు అమెరికా దేశాధ్యక్షుని ప్రేమకథ!
ప్రేమకధలు సినీ రంగానికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. ప్రతి ప్రేమకథలోనూ కొత్తదనం అభిమానులను అలరిస్తుందని సినీరంగం బలంగా నమ్ముతుంది. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రేమకథలు అభిమానులను అలరిస్తాయి. తాజాగా అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామాల ప్రేమకథ ఆధారంగా ఓ సినిమా రానుంది. 'సౌత్ సైడ్ విత్ యూ' పేరిట రూపొందనున్న ఈ సినిమాను గ్లెన్డన్ పాల్మర్ తెరకెక్కిస్తున్నారు. 1989లో ఒబామా తొలిసారి మిషెల్ రాబిన్సన్ (మిషెల్ ఒబామా)ను కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారి, వివాహంతో ముడిపడింది. దీంతో వారి ప్రేమకథ అభిమానులను అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.