: రవాణా పన్నుపై టీ.ప్రభుత్వం పునరాలోచించుకోవాలి: మంత్రి శిద్ధా


తెలంగాణలో ప్రవేశించే ఏపీ వాహనాలపై విధించే రవాణా పన్నుపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆలోచించుకోవాలని ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు కోరారు. నాలుగు రోజుల తరువాత ఎలాంటి స్పందన రాకపోతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో తామెన్నిసార్లు పిలిచినా తెలంగాణ ప్రభుత్వం చర్చలకు రాలేదని, ఈ విషయంలో లేఖ కూడా రాశామని తెలిపారు. రవాణా పన్నుపై తెలంగాణతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వాహనాలపై పన్ను విధించకూడదని నిర్ణయించారు. అనంతరం ఏపీ సచివాలయంలో మంత్రి మీడియాతో మట్లాడారు. ఉమ్మడి రాజధాని రాకపోకలపై హక్కు ఏపీకి ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News