: ఆ సినిమా చూసి అమీర్ కన్నీరు పెడితే, అమితాబ్ ఏమో ఆకాశానికెత్తేశారు!


'సెరిబ్రల్ పాల్సీ' వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి జీవితాన్ని కళ్లకు కట్టిన 'మార్గరిటా విత్ ఏ స్ట్రా' సినిమా బాలీవుడ్ సినీ దిగ్గజాలను ఆకట్టుకుంటోంది. కల్కి కోచ్లిన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో ఆమె నటనను అంతా మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలోని హృద్యమైన సన్నివేశాలను చూసి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ కన్నీరు పెడితే, బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ దీనిని ఓ అద్భుత కళాఖండంగా అభివర్ణించారు. బాలీవుడ్ ప్రముఖుల కోసం ఓ ప్రత్యేక షోను నిర్మాతలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ చెబుతూ, ఈ మధ్య కాలంలో తాను చూసిన మంచి సినిమా ఇది అని ట్వీట్ చేశారు. అమితాబ్ ఒక సినిమా చూశారంటేనే దానికి ప్రచారం లభిస్తుంది. అలాంటిది అమితాబ్ ఆ సినిమాను పొగుడుతూ ఆకాశానికెత్తేస్తే, ఇక సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ వచ్చేసినట్టే!

  • Loading...

More Telugu News