: మంత్రి దేవినేని, కేశినేని భూకబ్జాలకు పాల్పడుతున్నారు: కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ ఆరోపణ
ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నానిపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విమర్శలు గుప్పించారు. అధికార దర్పంతో పేట్రేగిపోతున్న దేవినేని, కేశినేని విజయవాడలో పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్నారని నెహ్రూ ఆరోపించారు. నగరంలోని పలు ప్రధాన సెంటర్లలోని భూముల చుట్టూ కంచెలు వేస్తున్న టీడీపీ నేతలు ఆయా స్థలాల యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీ నేతల భూకబ్జాలపై కాంగ్రెస్ పార్టీ పోరు సాగిస్తుందని నెహ్రూ ప్రకటించారు.