: స్మగ్లర్లలో మార్పు రావడం లేదు... అందుకే కఠినంగా వ్యవహరిస్తున్నాం: చినరాజప్ప
ఎన్ని కేసులు పెట్టి, జైళ్లలో పెట్టినా ఎర్రచందనం స్మగ్లర్లలో మార్పు రావడం లేదని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. అందుకే ఎర్రచందనం అడవులను కాపాడుకునేందుకు స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, శేషాచలం ఎన్ కౌంటర్ పై తమిళ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, మానవహక్కుల సంఘాలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్ కౌంటర్ పై ప్రభుత్వ విధానం మారదని స్పష్టం చేశారు. వీరప్పన్ ను పట్టుకునేందుకు తమిళనాడు ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తే, తాము తక్కువ ఖర్చుతో స్మగ్లింగ్ ను అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.