: ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టిసీమను పూర్తి చేస్తాం: ఏపీ మంత్రి దేవినేని ఉమ


పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును వదిలి కొత్త ప్రాజెక్టులేంటని ప్రతిపక్షం మొన్నటి శాసనసభా సమావేశాల్లో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాన్ని సమర్థంగానే ఎదుర్కొన్న చంద్రబాబు సర్కారు పట్టిసీమపై ముందకుసాగేందుకే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం దేవినేని మరోమారు పట్టిసీమపై సర్కారు కృత నిశ్చయాన్ని స్పష్టం చేశారు. మామిడి రైతులకు దళారీ వ్యవస్థ నుంచి రక్షణ కల్పిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News