: క్యుములోనింబస్ మేఘాలు మళ్లీ వచ్చాయి!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని పొట్టనబెట్టుకున్న క్యుములోనింబస్ మేఘాలు మరోమారు తెలుగు రాష్ట్రాలను చుట్టుముట్టాయి. అల్పపీడన ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల వల్ల ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాదులో పలు చోట్ల చిరు జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా క్యుములోనింబస్ మేఘాల కారణంగా వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి.