: ఫలక్ నూమా ‘అడ్డా’ రెస్టారెంట్ అదుర్స్... వరల్డ్ టాప్ రెస్టారెంట్ల జాబితాలో చోటు!


నిజాం నవాబులు నిర్మించిన ఫలక్ నూమా ప్యాలెస్ ఇప్పటికీ భాగ్యనగరికి మణిహారమే. నగరానికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారీ ఈవెంట్లకు వేదికగానూ నిలుస్తోంది. ప్యాలెస్ లోని ‘అడ్డా’ రెస్టారెంట్ మరో అడుగు ముందుకేసింది. వరల్డ్ టాప్ రెస్టారెంట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. హైదరాబాదుకు చెందిన ఏ రెస్టారెంట్ కూడా ఇప్పటిదాకా ఈ జాబితాలో చోటు సంపాదించుకోలేదు. జెట్ లైఫ్ స్టైల్ పబ్లికేషన్ ‘ఎలైట్ ట్రావెలర్’ నిర్వహించిన రీడర్స్ పోల్ లో ‘అడ్డా’ సత్తా చాటి వందో స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News