: ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది: కృతి సనన్
'దోచేయ్' సినిమా చాలా బాగుంటుందని హీరోయిన్ కృతి సనన్ నమ్మకంగా చెప్పింది. 'దోచేయ్' ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, తాను తీసే ప్రతి సన్నివేశం మీద దర్శకుడు సుధీర్ వర్మకు పూర్తి అవగాహన ఉందని అంది. హీరో చైతన్య స్పాంటేనియస్ యాక్టర్ అని చెప్పింది. ఆయనతో పని చేయడం మంచి అనుభూతిని మిగిల్చిందని కృతి చెప్పింది. సినిమా బాగా రావడానికి నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, బాపి చాలా కష్టపడ్డారని కృతి తెలిపింది. దోచేయ్ సినిమా పాటలు బాగా వచ్చాయని, పాటలు హాయిగా ఉన్నాయని చెప్పిన కృతి, సినిమా తీస్తున్నప్పుడు తాము ఎలా ఫీలయ్యామో, సినిమా చూసి ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని నవ్వుతూ చెప్పింది.