: సినిమా కథ, ఆడియో వేడుక ఆహ్లాదకరంగా ఉన్నాయి: నాగార్జున
దర్శకుడు సుధీర్ వర్మను కలిసినప్పుడు, అతను 'దోచేయ్' కథ చెప్పినప్పుడు, ఇప్పుడు పాటలు విడుదల చేయడానికి వచ్చినప్పుడు ఎంతో ఆహ్లాదకరమైన భావం కలిగిందని ప్రముఖ హీరో నాగార్జున తెలిపారు. దోచేయ్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయని, ఆహ్లాదకరంగా చిత్రీకరించారని దర్శకుడిని అభినందించారు. ఈ రోజే దోచేయ్ సినిమా సెట్లోకి వెళ్లానని, సినిమా నిర్మాత రాగానే అంతా ఆయనను సెట్లోకి ఆహ్వానించిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని నాగార్జున తెలిపారు. నిర్మాత భోగవల్లి ప్రసాద్ మంచితనమే సినిమాకు రక్ష అని ఆయన తెలిపారు. హీరోయిన్ కృతి సనన్ చాలా అందంగా ఉందని, ఆమె గురించి చైతన్య చెబుతుంటే విన్నానని చెప్పారు. దోచేయ్ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నానని, యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అని నాగార్జున తెలిపారు.