: పాటల గురించి నాకు పెద్దగా అవగాహన లేదు!: బ్రహ్మానందం
'దోచెయ్' సినిమాలో ప్రతి క్యారెక్టర్ ను అద్భుతంగా తీశారని హాస్యనటుడు బ్రహ్మానందం తెలిపారు. 'దోచెయ్' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, కథ బాగుందని అనుకుంటేనే చైతన్య సినిమా చేస్తారని అన్నారు. తనకు పాటల గురించి పెద్దగా అవగాహన లేదని, తాను బాగున్నాయని చెప్పగలిగిన సినిమా పాటలు 'అన్నమయ్య' సినిమా పాటలు మాత్రమేనని అన్నారు. ఈ సినిమాలో సన్నివేశాలు ఫ్రిజ్ లోంచి తీసిన దానిమ్మ గింజలంత హాయిగా, మధురంగా తీశారని అన్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం ఫ్రెష్ గా ఉంటుందని, అందర్నీ ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు.