: వైగో మా వాడే...బంధువవుతాడు: రాజేంద్రప్రసాద్
వైగో తమ వాడేనని టీడీపీ నేత బాబూరాజేంద్రప్రసాద్ తెలిపారు. ఓ ఛానెల్ నిర్వహించిన డిస్కషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైగో ఇంటి పేరు, తమ ఇంటి పేరూ ఒకటేనని, ఒకరకంగా చూస్తే బంధువవుతాడని అన్నారు. యలమంచిలి గోపాలస్వామి అచ్చమైన తెలుగు వ్యక్తని, అంతా తెలుగోడు అంటారనే భయంతో తమిళవాదినని చెబుతుంటాడని ఆయన చెప్పారు. వైగోది అంతా ఓవర్ యాక్షన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంట్లో స్వచ్చమైన తెలుగు మాట్లాడే గోపాలస్వామి, రోడ్డెక్కితే మాత్రం తమిళుడినని, తమిళుల కోసం కష్టపడుతున్నానని చెబుతుంటాడని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.