: దీపికా పదుకొనె 'మై చాయిస్'ను షేర్ చేస్తున్న హాలీవుడ్ నటుడు
మహిళా సాధికారతపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె 'మై చాయిస్' అనే వీడియోలో నటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై పలువురు విమర్శలు చేయగా, కొంతమంది ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ వీడియోను హాలీవుడ్ నటుడు ఆస్టన్ కుచర్ తన ఫేస్ బుక్ లో షేర్ చేసుకున్నాడు. వెంటనే ఆ పోస్టుకు 10వేల లైక్ లు వచ్చాయి. గతంలో మహిళల రక్షణపై అలియా భట్ నటించిన 'గోయింగ్ హోమ్' అనే వీడియోను కూడా ఆస్టన్ షేర్ చేసుకున్నాడు.