: పంజాబ్ ను రాజస్థాన్ అడ్డుకుంటుందా?
ఐపీఎల్ సీజన్-8లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరికాసేపట్లో తలపడనుంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు స్టార్ ప్లేయర్లతో పటిష్ఠంగా ఉండగా, రాజస్థాన్ రాయల్స్ ఎప్పట్లానే సాదాసీదా ఆటగాళ్లతో ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోంది. అనామక ఆటగాళ్లతో టైటిల్ సాధించిన ఏకైక జట్టుగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నేడు టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా పరిగణింపబడుతున్న పంజాబ్ జట్టుతో ఆడనుంది. పంజాబ్ జట్టులో హార్డ్ హిట్టర్లు సెహ్వాగ్, మాక్స్ వెల్ కు తోడు మురళీ విజయ్, జార్జ్ బెయిలీ, వృద్ధిమాన్ సాహా ఉన్నారు. అలాగే బౌలింగ్ లో మిషెల్ జాన్షన్, మాక్స్ వెల్, అక్షరపటేల్ ఉన్నారు. రాజస్థాన్ జట్టులో స్టార్ ప్లేయర్లు షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, రహానే, సంజూ సామ్సన్ బ్యాటింగ్ భారం మోస్తుండగా, ఆల్ రౌండర్ కోటాను స్టువర్ట్ బిన్నీ, జేమ్స్ ఫల్క్ నర్ భర్తీ చేస్తున్నారు. పేస్ బౌలింగ్ భారాన్ని టిమ్ సౌతీ మోయనుండగా, అతనికి వాట్సన్, ఫల్క్ నర్, బిన్నీ సహకారం ఆందించనున్నారు. దీంతో ఇరుజట్లు సామర్థ్యం మేరకు ఆడితే అభిమానులకు పసందైన క్రికెట్ విందు లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.