: లఖ్వీ విడుదలపై కేంద్రం, బీజేపీ ఆగ్రహం


ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్థాన్ విడుదల చేయడంపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీవ్రంగా మండిపడుతున్నాయి. లఖ్వీ విడుదలవడం దురదృష్టకరమని కేంద్ర హోంశాఖ వ్యాఖ్యానించింది. లఖ్వీపై న్యాయస్థానానికి పాక్ ప్రభుత్వం ఆధారాలు చూపలేకపోయిందని ఆరోపించింది. తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో పాక్ కు చిత్తశుద్ధిలేదని బీజేపీ విమర్శించింది. అటు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లఖ్వీ జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకోవడంలో కేంద్రం వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News