: పది పెళ్లిళ్లు చేసుకున్నా, ఇంకా పెళ్లే కాలేదంటోంది!
పది పెళ్లిళ్లు చేసుకున్నా, ఇంత వరకూ తనకు పెళ్లే కాలేదని ధ్రువీకరించిన మహిళ మోసాన్ని అమెరికన్ పోలీసులు బట్టబయలు చేశారు. లైనా క్రిస్టినా బారైన్ టోస్ (39) అనే మహిళ 1999 నుంచి వరుసగా పది పెళ్లిళ్లు చేసుకుంది. 2002లో ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడం విశేషం. వాలెంటైన్స్ డే రోజున ఒకరిని పెళ్లి చేసుకున్న క్రిస్టినా బారైన్, మరో 15 రోజుల తరువాత రాక్ ఐలాండ్ లో ఇంకొకర్ని వివాహమాడింది. సరిగ్గా నెల రోజుల తరువాత ఇంకొక వ్యక్తిని పరిణయమాడింది. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నా, ఎవరి నుంచీ విడాకులు తీసుకోకపోవడం విశేషం. అయితే తన మ్యారేజ్ లైసెన్స్ పై తనకింకా పెళ్లి కానట్టే పేర్కొంది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.