: భార్య కేసు పెట్టిందని కోర్టులో ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి
రంగారెడ్డి జిల్లాలోని మియాపూర్ కోర్టు వద్ద అశోక్ కుమార్ అనే మాజీ సైనికోద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అశోక్ తనను వేధిస్తున్నాడంటూ ఆయన భార్య గతంలో పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం మియాపూర్ కోర్టుకు వెళ్లింది. కోర్టులో వాదనల సందర్భంగా మనస్తాపానికి గురైన ఆయన పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.