: లంచగొండులపై కోపాన్ని పొలంపై చూపిన రైతు!


అత్తమీద కోపం దుత్తమీద చూపాడో రైతు. లంచగొండి అధికారులను ఏమీ అనలేక ఆరుగాలం పండించిన పంటను అగ్నికి ఆహుతిచ్చాడు. ఉత్తరప్రదేశ్‌ లోని మురదాబాద్ జిల్లా అహ్లాద్‌ పూర్ గ్రామానికి చెందిన అమీర్ హుస్సేన్ (54)తన పొలంలో గోధుమపంట వేశాడు. పంట ఏపుగా పెరిగి కోతకొచ్చే దశలో అకాల వర్షాల కారణంగా నాశనమైపోయింది. ఇంతలో రైతులను ఆదుకుంటామని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని చూసిన హుస్సేన్, తనకు కూడా పరిహారం అందించాలని దరఖాస్తు చేసుకున్నాడు. వీఆర్వో నుంచి సీనియర్ అధికారి వరకు అంతా పొలం చూసి 'నష్టం పరిహారం రాస్తాం, మాకేంటి?' అని అడగడంతో విసిగిపోయాడు. విధులు నిర్వర్తించేందుకు లంచమా? అని ఆవేదనతో తన పంటకు తానే నిప్పంటించుకున్నాడు. విషయం తెలిసి వెళ్లిన మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేసుకున్నాడా రైతు. ప్రభుత్వం విడుదల చేసిన 500 కోట్ల రూపాయలు నష్టపోయిన రైతులకా? లంచగొండి అధికారులకా? అని ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News