: మహారాష్ట్రలో కొత్త టోల్ విధానం... 12 టోల్ బూత్ ల మూసివేతకు నిర్ణయం
వచ్చే నెల నుంచి మహారాష్ట్రలో కొత్త టోల్ విధానం అమల్లోకి రాబోతోంది. ఈ క్రమంలో మే 31 నుంచి 12 టోల్ బూత్ లను మూసివేయనున్నారు. 53 టోల్ బూత్ లలో లైట్ మోటార్ వెహికల్స్, రాష్ట్ర రవాణా వాహనాలకు టోల్ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ వే సహా ముంబై లో ఐదు ఎంట్రీ పాయింట్లకు ఈ కొత్త టోల్ పాలసీ విధానం నుంచి మినహాయింపు ఇవ్వలేదు. జులై లో ఈ టోల్ పాయింట్లకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో టోల్ సమస్యలపై రెండు నెలల కిందట మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంతేగాక కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనలు టోల్ ట్యాక్స్ కు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు.