: ఢిల్లీ మాజీ ఎంఎల్ఏ ఇంట దొరికిన ఉత్తరాఖండ్ పోలీసుల ఆయుధాలు
2013లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రామ్ వీర్ షోకీన్స్ ఇంట్లో ఉత్తరాఖండ్ పోలీసుల నుంచి దొంగిలించిన కొన్ని ఆయుధాలు బయటపడడం సంచలనం కలిగించింది. ఆయన మేనల్లుడు, గ్యాంగ్ స్టర్ నీరజ్ భవానా ఈ నిషేధిత ఆయుధాలను పోలీసుల నుంచి దొంగిలించి రామ్ బీర్ ఇంట దాచి ఉంచినట్టు అధికారులు తెలిపారు. 2014 డిసెంబర్ లో భవానా పోలీసుల్ని తప్పించుకునే క్రమంలో ఏకే 47 తుపాకీతో పాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్ ను దొంగిలించాడు. వీటిని రామ్ వీర్ ఇంట్లో దాచి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు సోదాలు చేయగా ఇవి దొరికాయి. దీంతో నీరజ్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో రామ్ వీర్ షోకీన్స్ బరిలోకి దిగలేదు.