: తెలంగాణ ఎంసెట్ కు ఏపీ నుంచి 41వేల దరఖాస్తులు
తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు నిన్నటితో గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు 2,27,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 41వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ఎన్.వి.రమణారావు తెలిపారు. ఏయూ పరిధిలో 25వేలు, ఎన్ వీయూ పరిధిలో 16వేల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. వచ్చే నెల 15న తెలంగాణ ఎంసెట్ పరీక్ష జరగనుంది. మరోవైపు జేఎన్ టీయూ కాకినాడ నిర్వహిస్తున్న ఏపీ ఎంసెట్ దరఖాస్తులకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నెల 11 వరకు ఎలాంటి అదనపు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా తెలిపారు.