: మస్తాన్ బాబు మృతదేహం కోసం ఆండీస్ పర్వతాల్లో ట్రెక్కింగ్ మొదలు


అర్జెంటీనాలోని ఆండీస్ పర్వతాల్లో చిక్కుకుని చనిపోయిన మల్లి మస్తాన్ బాబు మృతదేహం కోసం ట్రెక్కింగ్ ప్రారంభమైంది. ట్రెక్కింగ్ నిపుణుడు హెర్నర్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం సిద్ధమైంది. ఇందులో భాగంగా సహాయ బృందం బేస్ క్యాంపుకు చేరుకుంది. మరో ఐదుగురు సభ్యుల బృందం ట్రెక్కింగ్ ప్రారంభించింది. ఇందుకోసం భారత రాయబార కార్యాలయం అన్ని అనుమతులను తీసుకుంది. ఇన్ని రోజులు పర్వతాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా మస్తాన్ బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. రానున్న మూడు రోజుల్లో అంటే ఈ నెల 13న ఆండీస్ పర్వత శ్రేణి నుంచి అతని మృతదేహాన్ని సైన్యం కిందకు తీసుకురానుంది. 17న నెల్లూరు జిల్లాలోని మస్తాన్ బాబు స్వగ్రామం గాంధీ జనసంఘం తరలిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News