: రాముడూ.. మీ నివేదికేమీ బాగోలేదు: ఏపీ డీజీపీకి హైకోర్టు మొట్టికాయ


ఏపీ డీజీపీ జేవీ రాముడుపై హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. శేషాచలం ఎన్ కౌంటర్ కు సంబంధించి సమగ్ర వివరాలతో పాటు ఇప్పటిదాకా పోలీసు శాఖ చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదికను కోర్టు కోరిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ కౌంటర్ జరిగిన తీరును వివరిస్తూ నివేదిక రూపొందించిన రాముడు... పోలీసులపై స్మగ్లర్ల దాడి, స్మగ్లర్లపై పోలీసుల కాల్పులకు సంబంధించి చర్యలపై మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. దీంతో నివేదికపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, అసలు ఎన్ కౌంటర్ లో పాలుపంచుకున్న పోలీసులపై కేసులు పెట్టారా? అంటూ నిలదీసింది. అంతేకాక సమగ్ర వివరాలతో మరోసారి నివేదిక అందించాలని హైకోర్టు, డీజీపీని ఆదేశించింది.

  • Loading...

More Telugu News