: ఆప్కాబ్ నూతన అధ్యక్షుడిగా పిన్నమనేని ఏకగ్రీవ ఎన్నిక


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) నూతన అద్యక్షుడిగా మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ గా వరుపుల బోగిరాజు ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. ఈ మేరకు వారి ఎన్నికల అధికారి తేజోవతి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన వారికి టీడీపీ నేతలు, పలువురు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News