: కర్నూలు జిల్లాలో ‘రాజా వారి చేపల చెరువు’... వైసీపీ నేత అక్రమ దందాపై సోదాలు!
ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఓ రాజకీయ నేత తుంగభద్ర తీరం సమీపంలో అక్రమ దందాకు తెర తీశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, కోసిగి మండలాల పరిధిలోని నదీ తీరానికి కూతవేటు దూరంలో 200 ఎకరాల మేర చేపల చెరువులను నెలకొల్పారు. ఈ చెరువులకు నదీజలాలను అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు సర్కారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు పోలీసుల రక్షణలో సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ఈ చెరువులకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.