: ఐపీఎల్ లో మరోమారు ఫిక్సింగ్ కలకలం... బుకీలపై బీసీసీఐకి ‘రాయల్స్’ ఆటగాడు ఫిర్యాదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఫిక్సింగ్ భూతం వీడలేదు. ఐపీఎల్-6ను ఓ కుదుపు కుదిపేసిన ఫిక్సింగ్ భూతం, తాజాగా ఐపీఎల్-8లోనూ రంగప్రవేశం చేసింది. ఈసారి కూడా మునుపటిలానే రాజస్థాన్ రాయల్స్ జట్టులోనే ఈ ఆరోపణలు వెలుగు చూశాయి. తనను బుకీలు సంప్రదించారని ఆ జట్టుకు చెందిన ఓ సభ్యుడు బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. ఆటగాడి ఫిర్యాదుతో బీసీసీఐ యాంటీ కరప్షన్ సెల్ రంగంలోకి దిగింది. ఆటగాడిని రహస్యంగా విచారిస్తున్న ఆ సెల్, పూర్తి వివరాలను సేకరిస్తోంది. అయితే సదరు ఆటగాడు ఎవరన్న విషయాన్ని మాత్రం బీసీసీఐ వెల్లడించడం లేదు.