: పేరు మారుతోంది, ఏపీ ఎక్స్ ప్రెస్.... ఇక తెలంగాణ ఎక్స్ ప్రెస్!
హైదరాబాదు, న్యూఢిల్లీల మధ్య రాకపోకలు సాగిస్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ ను ఇకపై తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా పరిగణిస్తారు. ఈ మేరకు మరో రెండు రోజుల్లోగా సదరు రైలు పేరును మార్చివేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. సికింద్రాబాదు నుంచి బయలుదేరే ఏపీ ఎక్స్ ప్రెస్ ను తెలంగాణ ఏక్స్ ప్రెస్ గా మార్చడంతో పాటు ఏపీలోని విశాఖ నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి మరో రైలును త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. కొత్త రైలును ఏపీ ఎక్స్ ప్రెస్ గా పరిగణించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై నిన్న ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో భేటీ అయిన సందర్భంగా ఈ విషయాలను వెల్లడించారు.