: హైకోర్టును ఆశ్రయించనున్న ‘సత్యం’ రామలింగరాజు!
దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసంగా వినుతికెక్కిన సత్యం కుంభకోణంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు బైర్రాజు రామలింగరాజుతో పాటు ఆయన సొదరుడు, మరో ఎనిమిది మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో నిన్న రాజు సహా పది మంది దోషులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే, సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలని రామలింగరాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ దిశగా ఆయన చర్యలు కూడా ప్రారంభించారని తెలుస్తోంది. నేడో, రేపో ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.