: బాలయ్య బాబు, మణిశర్మ కాంబినేషన్ హిట్!: బోయపాటి శ్రీను
బాలయ్యబాబు, మణిశర్మ గారి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ అని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. 'లయన్' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఇంత వరకు బాలయ్యబాబు, మణిశర్మ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అని అన్నారు. టాలీవుడ్ లో బాలయ్యబాబుతో పెద్దపెద్ద దర్శకులు అద్భుతమైన సినిమాలు చేశారని అన్నారు. ఆయన గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన అభిమానులు ఇలాగే ఆదరించాలని ఆయన ఆకాంక్షించారు. బాలయ్యబాబుతో సినిమా ఎప్పుడు అనేది తానే ప్రకటిస్తానని, ఆయనతో సినిమా చేస్తానని బోయపాటి తెలిపారు.