: శేషాచలం మృతులకు అన్నా డీఎంకే పరిహారం


శేషాచలం అటవీ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో మృతి చెందిన తమిళ కూలీల కుటుంబాలకు అధికారపార్టీ అన్నా డీఎంకే పరిహారం ప్రకటించింది. కాల్పుల ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్న పార్టీ అధినేత్రి జయలలిత, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కోరారు. అలాగే మృతి చెందిన ప్రతి కుటుంబానికి తలా రెండు లక్షల రూపాయల పరిహారం అందజేస్తామని ఆమె చెప్పారు. ఇంతకు ముందే తమిళనాడు ప్రభుత్వం తరపున తలా మూడు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News