: బాలకృష్ణ గారి వల్ల మూడేళ్ల తరువాత మళ్లీ కలిశా: త్రిష


మూడేళ్ల విరామం తరువాత బాలకృష్ణగారు అవకాశం ఇవ్వడం వల్ల తెలుగు అభిమానులను కలుసుకునే అవకాశం కలిగిందని లయన్ హీరోయిన్ త్రిష పేర్కొంది. లయన్ ఆడియో వేడుకలో త్రిష మాట్లాడుతూ, గతంలో చాలా సినిమాల్లో బాలయ్యతో పనిచేసే అవకాశం మిస్ అయ్యానని, ఈసారి ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం దక్కిందని చెప్పింది. సినిమా చాలా బాగుంటుందని, ఆడియో అభిమానులను అలరిస్తుందని త్రిష ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఆడియో వేడుకలో పాల్గొనడం అద్భుతమైన అనుభవమని త్రిష పేర్కొంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, సీనియర్ నేతలు, బాలకృష్ణ తదితరుల సరసన కూర్చోవడం గౌరవమని త్రిష చెప్పింది.

  • Loading...

More Telugu News