: ఎన్ కౌంటర్ మృతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వం: డిప్యూటీ సీఎం చినరాజప్ప
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం చినరాజప్ప మాట్లాడుతూ, మృతులకు ఎక్స్ గ్రేషియా చెల్లించేది లేదని తేల్చిచెప్పారు. మృతులంతా తమిళులేనని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి మన సీఎంకి రాసిన లేఖ అందిందని చెప్పిన ఆయన, దానికి జవాబు ఇస్తామని చెప్పారు. జరిగిన దానిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి సమగ్ర నివేదిక ఇస్తామని అన్నారు. దీనిపై ఇతర ఉన్నత న్యాయస్థానాలకు కూడా నివేదిక ఇస్తామని ఆయన చెప్పారు.