: మోదీ, కేసీఆర్ వల్లే రైతులకు కష్టాలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టడంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయాన్ని, రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా భూసేకరణ బిల్లు తీసుకొచ్చేందుకు మోదీ ఆర్డినెన్స్ తీసుకువస్తే, కేసీఆర్ మద్దతిస్తున్నారని, దీనిని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. వాటర్ గ్రిడ్ పథకం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని, పైప్ లైన్ వేసేందుకు రైతుల అనుమతి అవసరం లేదని బిల్లులో ఉందని, పైప్ లైన్ వేసిన ప్రాంతంలో పంటలు, చెట్లు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని, అలా జరిగితే రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆయన చెప్పారు.