: సిమీ ఉగ్రవాదుల సమాచారంతో పాతబస్తీలో కార్డన్ సెర్చ్


సిమీ ఉగ్రవాదుల కదలికలున్నాయన్న సమాచారంతో హైదరాబాదులోని పాతబస్తీలోని భవానీనగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. 500 మంది పోలీసులు భవానీనగర్ ను దిగ్బంధనం చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు కార్డులు లేని 20 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 7 ఆటోలు, 18 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News