: రజనీకాంత్ సినిమాల్లోనే ఇలాంటి ఎన్ కౌంటర్ లు జరుగుతాయి: అసదుద్దీన్


తీవ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ ను సినీ నటుడు రజనీకాంత్ సినిమాలతో పోల్చారు ఎంపీ అసదుద్దీన్. ఇలాంటి ఎన్ కౌంటర్లు రజనీ సినిమాల్లోనే జరుగుతాయని అన్నారు. ఎన్ కౌంటర్ జరిగినప్పుడు వాహనంలో 17 మంది పోలీసులున్నారన్న అసదుద్దీన్, ఇలాంటి ఎన్ కౌంటర్లతో పెట్టుబడిదారులకు ఎలాంటి మెసేజ్ పంపుతారని ప్రశ్నించారు. ఎన్ కౌంటర్ పై సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ అసదుద్దీన్ నేతృత్వంలో పలువురు సీఎం కేసీఆర్ ను సచివాలయలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ పై ముస్లింలకు అనేక ఆశలున్నాయని చెప్పారు. ఎన్ కౌంటర్ పై అనుమానాలు నివృత్తి చేయాలని కోరామన్నారు. స్పందించిన సీఎం సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామన్నారని తెలిపారు. కాల్పుల ఘటన దురదృష్టకరమని కేసీఆర్ అన్నారని, కొంత సమయం ఇస్తే కాల్పుల ఘటనపై విచారణకు ఆదేశిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News