: ఉగ్రవాది లఖ్వీని విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు ఆదేశం
నిర్బంధంలో ఉన్న 26/11 పేలుళ్ల ప్రధాన సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీని వెంటనే విడుదల చేయాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. గతంలో రెండుసార్లు లఖ్వీకి బెయిల్ లభించినప్పటికీ భారత్ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 13న లఖ్వీని నిర్బంధంలోకి తీసుకోవాలన్న ఫెడరల్ గవర్నమెంట్ ఆదేశాన్ని సస్పెండ్ చేసిన ఇస్లామాబాద్ హైకోర్టు, వెంటనే అతన్ని విడుదల చేయాలని కూడా ఆదేశించింది. మళ్లీ పాక్ హైకమిషనర్ కు భారత ప్రభుత్వం సమన్లు ఇవ్వడంతో రెహ్మాన్ విడుదల ఆగిపోయింది. మరి, తాజా ఆదేశాలతో పాక్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి!