: సత్యం ఇతర దోషులకు కూడా జైలు, జరిమానా
ప్రపంచాన్ని నివ్వెరపరచిన సత్యం కుంభకోణంలో పది మందికి ఏడేళ్ల జైలు శిక్ష, చైర్మన్ బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజులకు తలా 5 కోట్ల రూపాయలు, మిగిలిన ఎనిమిది మందికి తలా 25 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. కాగా, అసలు ముద్దాయి రామలింగరాజు కావడంతో అతని తీర్పును ముందుగా వెలువరిచిన న్యాయస్థానం, ఇతరుల తీర్పును తరువాత వెల్లడించింది. అయితే, రామలింగరాజు ఇప్పటికే 33 నెలలు రిమాండు ఖైదీగా ఉన్నందున, మిగిలిన కాలానికి జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అనారోగ్య కారణాల నేపథ్యంలో ఆయన హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం. తీర్పు వెలువడిన నేపథ్యంలో వారిని న్యాయస్థానం నుంచి నేరుగా చర్లపల్లి జైలుకి తరలించనున్నారు.