: టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న నిరుద్యోగ జేఏసీ... ఉస్మానియాలో ఉద్రిక్తత
హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సీటీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్యెల్యే గాదరి కిషోర్ లను నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగులకు టీఆర్ఎస్ సర్కారు అన్యాయం చేస్తోందని, తక్షణం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తూ, ప్రజా ప్రతినిధులను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఎంపీ, ఎంఎల్ఏల రాకపై ముందే సమాచారం అందుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు.