: కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి కోట్ల
తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి, టీడీపీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలను మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు వ్యాపారం కోసం రాజకీయ నేతలను భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు.