: 1993 ముంబయి పేలుళ్ల కేసు నేరస్థుడి పిటిషన్ తిరస్కరణ
1993 ముంబయి పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమన్ రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనకు విధించిన మరణశిక్షను జీవితకాల శిక్షగా మార్చాలంటూ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం విధించే జీవితకాల శిక్ష 14 సంవత్సరాల కంటే జైల్లో తాను దాదాపు 20 ఏళ్లకు పైగానే శిక్ష అనుభవించానని తన పిటిషన్ లో మెమన్ పేర్కొన్నాడు. ఇదిలాఉంటే, అతను ఇప్పటికీ తన శిక్షపై చివరిగా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల కిందట ఈ కేసులో ట్రయల్ కోర్టు అతనికి మరణశిక్ష విధించగా, సుప్రీం ధ్రువీకరించింది. గతేడాది రాష్ట్రపతికి మెమన్ క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకోగా ఆయన తిరస్కరించారు.